![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ నుంచి చాలామంది ఎలిమినేట్ అయ్యారు. కొంతమంది ఆడి ఓడారు.. ఇంకొంతమంది ఆడకుండానే ఓడారు. ఇంకొంతమంది ఆటే ఆడకుండా ఇంకా హౌస్‌లో కొనసాగుతున్నారు. కానీ ఎలిమినేట్ అయ్యి.. విన్నర్లా బయటకు వచ్చిన ఒకే ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఎవరైనా ఉన్నారంటే అది ది గ్రేట్ లేడీ సింగం రోహిణి మాత్రమే.
అవును.. సీజన్ 8 శివంగి రోహిణి గెలుపుతో బయటకు వచ్చింది. పద్నాల్గవ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా.. రోహిణిని షాకింగ్ ఎలిమినేషన్ చేశారు. ఈమె ఏమి ఆడుతుందని.. కిందనుంచి పైవరకూ హేళనగా చూసిన వాళ్లే.. ఆమె గెలుపు చూసి తల దించుకునేట్టుగా ఆడపులిలా ఆడింది రోహిణి. హౌస్‌లో మిగిలిన లేడీ కంటెస్టెంట్స్ ప్రేరణ, విష్ణు ప్రియలకంటే బాగా ఆడింది రోహిణి. ఆడి గెలిచింది కూడా. కానీ.. ఏం చేస్తాం.. ఆమె ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నామినేషన్స్‌లోకి రాకపోవడమే శాపంగా మారింది. ఆటలో తోపు అయినా.. ఓటింగ్‌లో గ్రాఫే లేకపోవడంతో ఈవారం డబుల్ ఎలిమినేషన్లో రోహిణి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
హౌస్‌లో మిగిలిన టాప్-7 కంటెస్టెంట్స్ కటౌట్స్ గార్డెన్ ఏరియాలో పెట్టారు. అవినాష్ ఆల్రెడీ ఫినాలేకి వెళ్లడంతో అతని కటౌట్‌ని తొలగించారు. మిగిలిన ఆరుగురిలో ఎవరి కటౌట్ అయితే కిందపడిపోతుందో.. వాళ్లు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పగా.. రోహిణి కటౌట్ పడిపోవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యిందని ప్రకటించారు నాగార్జున. అయితే రోహిణి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తుంటే.. హౌస్‌లో ఉన్న వాళ్లంతా నిలబడి చప్పట్లు కొట్టడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే తొలిసారి. నువ్వు చాలామందికి ప్రేరణగా నిలిచావ్.. నువ్వు లేడీ సింగం. అమ్మాయిలు తలుచుకున్నా.. ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ఏమైనా సాధించొచ్చని చెప్పావంటూ సెల్యూట్ చేశారు. నిఖిల్ అయితే తల ఎత్తి వెళ్లు రోహిణి అని అన్నాడు. హౌస్‌లో ఉన్నప్పుడు జీరో.. జీరో అని అన్న విష్ణు ప్రియ.. నువ్వు లేడీ శివంగి అని ఆకాశానికి ఎత్తేసింది. ఈ మాటతోనే రోహిణి గెలిచేసింది. ఇప్పటివరకూ ఎలిమినేట్ అయిన వాళ్లెవ్వరికీ ఇలాంటి సెండాఫ్ రాలేదని హౌస్‌లో వాళ్లు అనడంతో చాలా సంతోషంగా హౌస్ నుంచి బయటకు వెళ్లింది రోహిణి.
![]() |
![]() |